పుష్ప ఐటమ్ సాంగ్ లో శర్వానంద్ హీరోయిన్.. టైట్ హగ్ ఇచ్చి మరీ..!

-

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న డీ గ్లామరస్ పాత్ర పోషించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ మేనరిజం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా ఐటెం సాంగ్ లో సమంత కూడా అదరగొట్టేసింది అని చెప్పాలి.

అల్లు అర్జున్ కూడా పూర్తిగా తన సమయాన్ని ఈ సినిమాకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆయన ఈ సినిమా తప్ప మరే సినిమాకి కూడా సమయాన్ని కేటాయించకపోవడం గమనార్హం. ఇకపోతే పుష్ప పార్ట్ 2 షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదని సమాచారం.

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , పోస్టర్ అన్నీ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారన్న దానిపై పెద్ద చర్చ మొదలైన విషయం తెలిసింది.. ఇక మొన్నటి వరకూ పుష్ప 2 లో కూడా సమంతానే ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఫోటో సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్గా నటించిన సీరత్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.

ఈ బ్యూటీ తాజాగా అల్లు అర్జున్ ను హగ్ చేసుకున్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసింది..” ఎదగడానికి డాన్సర్లకు రెక్కల అవసరం లేదు.. అది తెలుసుకున్న వారికి వారి ఎనర్జీ దారి చూపుతుంది..” అంటూ అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇది చూసిన చాలా మంది పుష్ప 2 లో సీరత్ ఐటమ్ సాంగ్ చేస్తోందని క్లారిటీ కి వస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version