అతనితో రిస్క్ చేస్తున్న శర్వానంద్..!

-

టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాలెంటెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ తన సినిమాల సెలక్షన్స్ విషయంలో ఆచితూచి అడుగులేస్తాడు. ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్ లో పడి పడి లేచే మనసు సినిమాతో రాబోతున్న శర్వానంద్ తన తర్వాత సినిమా విషయంలో డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. అదేంటి అంటే ఓ ఫ్లాప్ డైరక్టర్ తో శర్వా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట.

కొత్తబంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్, మహేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసినా ఆ తర్వాత మహేష్ తో బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో వెనుకపడ్డాడు. అతనితో నిర్మాతలు సినిమా తీసే సాహసం చేయట్లేదు. అయితే గీతా ఆర్ట్స్ శ్రీకాంత్ అడ్డాలకు ఓ ఛాన్స్ ఇస్తున్నారట.

శ్రీకాంత్ చెప్పిన కథకు ఓకే చెప్పిన గీతా అధినేతలు ఆ సినిమాలో శర్వానంద్ ను హీరోగా తీసుకోనున్నారట. ఫ్లాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ తో రిస్కైనా పర్లేదు సినిమా చేస్తా అంటున్నాడట శర్వానంద్ మరి ఈ సినిమా హిట్ కొట్టి శ్రీకాంత్ తన సత్తా చాటుతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news