Big Boss OTT Telugu: వాళ్లకు ‘బిగ్ బాస్’ టైటిల్ విన్నింగ్ చాన్సెస్..శ్రవంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఆరోవారం రసవత్తరంగా సాగింది. శ్రవంతి, ముమైత్ ఖాన్ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత శ్రవంతి తాజా ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ టైటిల్ విన్నర్స్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ గురించి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే శ్రవంతి, ముమైత్ ఖాన్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

24 బై 7 ఓటీటీషోలో ఈ సారి కంటెస్టెంట్స్ గేమ్ ను చాలా సీరియస్ గా ఆడుతున్నారు. టాస్కులు, ఫన్నీ గేమ్స్ ఆడటంలో కంటెస్టెంట్స్ డీల్స్ కుదుర్చుకుని మరి ముందుకు సాగుతున్నారు. ‘బిగ్ బాస్’ షోలో అఖిల్ వర్సెస్ శివ అని పేర్కొన్న శ్రవంతి..అరియానా, బిందు మాధవి ఫ్రెండ్లీగానే ఉంటారని తెలిపింది. మిగతా కంటెస్టెంట్స్ గ్రూపు గేమ్ ఆడుతున్నారని, అజయ్, అఖిల్ ఇద్దరూ ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతారని స్పష్టం చేసింది శ్రవంతి.

‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ టైటిట్ విన్ అయ్యే చాన్సెస్ ఆ ముగ్గురికి ఉంటాయని శ్రవంతి తెలిపారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ అషురెడ్డి, అఖిల్, శివ అని చెప్పారు. అయితే, సోషల్ మీడియాలో బిందు మాధవికి టైటిల్ విన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతున్నది. బిందు మాధవి సపోర్టర్స్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కూడా పెడుతున్నారు. కానీ, శ్రవంతి ఉద్దేశంలో మాత్రం అషురెడ్డి, అఖిల్, శివకు టైటిల్ గెలుచుకునే చాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news