బ‌ర్త్‌డేకి హీరోయిన్ లిప్‌లాక్ బ‌హుమ‌తి?

సెల‌బ్రిటీల బ‌ర్త్‌డే వ‌చ్చేసిందంటే కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చేస్తుంటారు. కానీ క్రేజీ హీరోయిన్ శ్రియ మాత్రం క్రేజీగా వెరైటీ గిఫ్ట్‌ని ప్లాన్ చేసింది. తెలుగులో `ఇష్టం` సినిమాతో కెరీర్ ప్రారంభించి  రెండు ద‌శాబ్దాలు కావ‌స్తున్నా శ్రియ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటూనే వుంది. ఈ డెకేడ్‌కే క్రేజీయెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా భావిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`తో పాటు ఐదు భాష‌ల్లో రూపొందుతున్న `గ‌మ‌నం` చిత్రం..సండ‌క్కారి, న‌ర‌గాసుర‌న్‌, త‌డ్కా చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వుంది.

ఇంత బ‌జీ టైమ్‌లోనూ సేయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్‌కి చెందిన బిజినెస్‌మెన్‌ ఆండ్రూ కొచ్చీవ్‌తో ప్రేమ‌లో ప‌డింది. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో 2018లో హుష్ హుష్ వెడ్డింగ్‌తో వీరిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు. అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో వీరి అల్ల‌రికి హ‌ద్దు అదుపూ లేకుండా పోయింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో స్పెయిన్‌లో స్ట్ర‌క్క‌యిన ఈ జోడీ ఇన్‌స్టాలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కొత్త కొత్త భంగిమ‌ల‌తో శ్రియ యోగాస‌నాలు చేస్తుంటే ఆ భంగిమ‌ల్ని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆండ్రూ కోశ్చివ్‌. తాజాగా ప్రియ‌మైన హ‌జ్బెండ్ పుట్టిన రోజు కావ‌డంతో వెరైటీ గిఫ్ట్‌ని ఇచ్చేసింది శ్రియ‌. లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసి ఇదే బ‌ర్త్‌డే గిఫ్ట్ అని చెప్పేసింది. ఆండ్రూ కూడా బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిందంటూ సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన పొటోలు వైర‌ల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

Thank you for a beautiful birthday @andreikoscheev Thank you for all your wishes .

A post shared by Shriya Saran (@shriya_saran1109) on