Shruti Haasan | శ్రుతి హాసన్ .. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి, మెప్పించింది. వరసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బిజీ బిజీగానే దూసుకపోతుంది.
ఎంత బిజీగా ఉన్నా.. తన పర్సనల్ లైఫ్ ని ఎంత మాత్రం కోల్పోవడానికి ఇష్టపడదు శృతి. విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో చాలా రోజులు డేటింగ్ లో ఉంది. పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట.. విడిపోయింది. బ్రేకప్ తర్వాత శ్రుతి కొత్త బోయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. కానీ, వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇప్పటివరకు స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో శ్రుతి పోస్ట్ చేస్తున్న ఫొటోలు వారిద్దరి మధ్య బంధాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా దీపావళి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి పోస్ట్ మీడియాలో వైరల్ అయింది.
ఆ ఫొటోలో శ్రుతి, తన ప్రియుడు సాంప్రదాయ దుస్తులు ధరించి, దీవపాళి వేడుకున్నజరుగున్నట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో శ్రుతి తన ప్రియుడు కౌగిలో లో బంధీగా మారిపోయింది. `మా పరిపూర్ణ దీపావళికి సంబంధించిన అసంపూర్ణ ఫొటో.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు` అని శ్రుతి కామెంట్ చేసింది.