ప్రతి నాలుగు ప్రగ్నెన్సీలలో ఒకటి మిస్ కారీ అవుతోంది. మీకు తెలుసా..ప్రతిసంవత్సరం 23 మిలియన్ల గర్భస్రావాలు జరుగుతున్నాయట. గర్భస్రావం అయిన మహిళ ఆ బాధను ఎదుర్కోవటం చాలా కష్టమైన పనే. తాజాగా ఉమెన్స్ కంపెంనీ..ఫేస్ బుక్ తో కొలాబ్రేట్ అయి క్రియేటివ్ ఐడియాతో ముందుకువచ్చింది. అదేంటంటే..’ది కంపాషినేట్ ప్యాడ్’ గర్భస్రావం అయ్యే మహిళలకు అండగా ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా.. గర్భస్రావం అయిన మహిళలకోసం డిజైన్ చేయబడ్డ ప్యాడ్ ఇది.
కంపాషినేట్ ప్యాడ్ లో ప్రత్యేకత ఏంటి?
ఈ ప్యాడ్ లో మెసేజింగ్ బాట్ అంటే ‘టెండర్’ అని ఒకటి ఉంటుంది. అంటే..మనకు బ్యాంక్ యాప్స్, ఇంకా కొని షాపింగ్ యాప్స్ కు చాట్ బాక్స్ ఎలా అయితే ఉంటాయే..అలా ఈ కంపాషినేట్ ప్యాడ్స్ కు టెండర్ ఉంటుంది. దీని ద్వారా గర్భస్రావం అయిన మహిళ లేదా, ఆమె తాలుకా వాళ్లు ప్యాడ్ కొనుక్కోవచ్చు. గైనకాలజిస్టుల సలహాలు, సూచనలు, ఇంకా గర్భస్రావం అయిన మహిళలు అనుభవాలు, మనం ఏదైనా అడగాలనకున్నా అన్నీ ఉంటాయి.
మహిళలు గర్భస్రావం అయినప్పుడు వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వారే చెప్తారు. మనం వినవచ్చు లేదా చదువుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా ఆ మహిళకు ఉండే సందేహాలు అన్ని నివృత్తి చేయటానికి అనుభవుజ్ఞులైన గైనకాలజిస్టుల సలాహాలు ఉంటాయి. దాని ద్వారా మహిళకు కాస్త మానసిక ధైర్యం వస్తుంది. ఫేస్ బుక్ మెసేంజర్ ద్వారా ఈ టెండర్ తో చాట్ చేయొచ్చు. త్వరలో ఈ అవకాశాన్ని వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ కు కూడా కల్పించనున్నారు.
ఇంకా ఈ ప్యాడ్ బాక్స్ కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా ఏమైనా సీక్రెట్ గా ఉండే విషయాలు చర్చించాలి అన్నప్పుడు వీడియోకాల్ లేదా ఆడియో కాలే చేసి కమ్యునిటీ పీపుల్స్ సలహాలు తీసుకోవచ్చు. అంటే వైద్యులు, ప్రొఫిషినల్స్, ఫిట్ నెస్ ఎక్సపర్ట్స్.
ఎలా ఉంటుంది?
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శానిటరీ ప్యాడ్. గర్బస్రావం అయిన మహిళలను దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా ఇది డిజైన్ చేశారు. గర్భస్రావం అయినప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంది. అందుకే ఇది చాలా పొడవుగా, ఎక్కువు లేయర్స్ తో ఉంటుంది. ఇంకా ఇది పర్యావరణానికి హానికరం కాదు. బయోడీగ్రేడబుల్ ప్యాడ్ ఇది. ఇందులో ఉపయోగించిన కాటన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందట. ఉమెన్స్ కంపెనీ అందిస్తున్న చాలా ప్రొడెక్ట్స్ లో ఇది ప్రత్యేకం అనే చెప్పాలి.
ఉమెన్స్ కంపెనీ శానిటరీ నాప్‌కిన్‌లు, ప్యాంటీ లైనర్లు, 100% ఆర్గానిక్ కాటన్ టాంపాన్‌లు, స్టాండ్ & పీ యూరినేషన్ పరికరాలు, మెడికల్ గ్రేడ్ సిలికాన్ కప్పులు మరియు వెదురు రేజర్‌ల వరకు ఉత్పత్తుల శ్రేణిని ఇది మహిళలకు అందిస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులన్నీ ఆర్గానిక్, బయోడిగ్రేడబుల్ మరియు పర్యావరణ అనుకూలమైనవే.
అనికా పరాశర్ మార్చి 2020లో రూపమ్ గుప్తాతో కలిసి ఈ బ్రాండ్‌ను స్థాపించారు, ఇది నేటి మహిళల కోసం టైలర్-మేడ్ ఇంటిమేట్ వెల్‌నెస్ మరియు పరిశుభ్రత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి మరియు పంపిణీ చేయడానికి చాలా అనువైనదనే చెప్పాలి.. ఉమెన్స్ కంపెనీ కేవలం FMCG కంపెనీ మాత్రమే కాదు – ఇది మహిళలకు ఒక ఆరోగ్యసంరక్షణ ప్లాట్ ఫామ్ లాంటిది. దశాబ్దాల నుంచి మహిళలు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కస్టమైజ్డ్ గా వీళ్ల ప్రొడెక్ట్స్ ఉంటాయి.
ఉమెన్స్ కంపెనీ కో ఫౌండర్స్ మరియు స్ట్రాటజిస్ట్‌లు అయిన సనోవర్ శ్రీవాస్తవ్, దివ్య నైల్‌వాల్ ఏం చెప్తున్నారంటే.. “కంపాసినేట్ ప్యాడ్‌లో పని చేసే అవకాశం తమకు వచ్చినప్పుడు..ఈ ప్రొడెక్టు ప్యాకింగ్ కూడా మేము ఆ మహిళను సపోర్ట్ చేసిదా ఉండాలని అనుకున్నాము. అందుకు అనుగుణంగానే క్రియేటివ్ గా ప్యాడ్ ప్యాకింగ్ డిజైన్ చేశాం. ప్రతి ప్యాడ్ పైన మీకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇచ్చేలానే వీటిని రూపొందిచటం జరిగింది. ఇంకా ఇందులో ఉండే టెండర్ చాట్ బాక్స్ కూడా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది” అవును ఈ ప్యాడ్స్ పైన కూడా ఒక్కో కొటేషన్ ఉంటుంది. ఓ మహిళకు ఈ దశ చాలా చేదు అయినదే.అందుకే వారికి మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ ఇలా చేయటం చాలా మంచి ఆలోచన అనే చెప్పాలి.
ఫేస్‌బుక్ క్రియేటివ్ షాప్ EMEA వైస్ ప్రెసిడెంట్ కైట్లిన్ ర్యాన్ మాట్లాడుతూ..”ఇలాంటి ప్యాడ్స్ కంపెనీతో కనెక్ట్ అవటం మాలాంటి ఫ్లాట్ ఫాంలో ఉన్న వ్యాపారస్తులకు, బిజినెస్ లో మానవత్వం ఉందని చెప్పటానికి ఉమెన్ ప్యాడ్స్ అనేది మంచి ఉదాహరణ. మహిళలకు సంబంధించిన అన్నిరకాల అవసరాలకు, పరిశుభ్రతకు కంపాషినేట్ ప్యాడ్స్ ఒక బ్లూ ప్రింట్ గా మారుతాయి అనటంలో సందేహం ఏం లేదు. ఇక గర్బస్రావం విషయానికి వస్తే దీని గురించి మాట్లాడానికి చాలామంది సిగ్గుపడతారు. ఎవరికి సరైన వాస్తవాలు తెలియదు. ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయటానికే టెండర్ ద్వారా ఎంతో మంది ఈ పరిస్థితిని ఫేస్ చేసిన వారి అనుభవాలను అందించటం జరుగుతుంది. నిజంగా ఇది ఆ మహిళకు సపోర్ట్ గా నిలుస్తుందనే ఆశిస్తన్నాను”.
ఇదండి కంపాషినేట్ ప్యాడ్ యెక్క ప్రత్యేకత. మీకు తెలుసో లేదో..గర్భస్రావం అయిన మహిళ చాలా కుంగిపోతుంది. ఒంటరితనంగా ఫీల్ అవుతుందట. ఆ సమయంలో వారికి సపోర్ట్ చాలా అవసరం. మేము ఉన్నాం అనే తోడు కుటుంబసభ్యుల నుంచి కచ్చితంగా రావాలి. అలాంటి ఓ సపోర్ట్ నే ఈ కంపాషినేట్ ప్యాడ్స్ అందిస్తున్నాయి.