పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు.పైకి పవన్ పేరు వినిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో లెక్కలు వేరే అని చర్చలు జరుగుతున్నాయి. ఇది పక్కా అంటున్నారు వైసీపీ శ్రేణులు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు.సామాజికవర్గం పరంగా ఇక్కడ బాగా కలిసొస్తుందని ఆయన భావించారు.దాదాపు తొంబై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ పిఠాపురం నుంచి బరిలో దిగారు. ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టడానికి పవన్ కల్యాణ్ గట్టి ప్రయత్నమే చేశారు.భారీగా ఓట్లు పోల్ కావడంతో పోలింగ్ సరళని చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
పిఠాపురంలో పవన్ గెలుస్తాడా లేదా అనే దానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.పోలింగ్ జరిగిన తర్వాత లక్ష మెజార్టీ పక్కా అని జనసేన , టీడీపీ నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు 10 నుంచి 20 వేలు మెజార్టీకి వారే తగ్గించేస్తున్నారు.ఈ పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది.బూత్‌ల వారిగా ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అన్నట్టుగా కూటమి నేతల పరిస్థితి తయారైంది.పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపు ఓట్లు ఉండగా యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్‌కే పడినట్లు భావిస్తున్నారు.ఇక మధ్య వయస్సువారి ఓట్లు , మహిళల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే పడినట్లు అంచనా వేస్తున్నారు.నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేల ఓట్లు పోల్ కావడంతో వంగా గీత వైపే విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.పైకి జనసేన పేరు చెబుతున్నా గ్రౌండ్ లెవల్ వేరేలా ఉందని అంటున్నారు.
ఈ పరిణామం జనసేన పార్టీకి కాస్త ముంగుడుపడని విషయమే. కానీ ఎన్నో కొన్ని ఓట్లతో పవన్ బయట పడటం ఖాయం అనుకుంటున్నారు.వాస్తవానికి పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గoపై ప్రత్యేక దృష్టి సారించారు.మూడో కంటికి తెలియకుండా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు.కేడర్ ను అన్నివిధాలుగా సమాయత్తం చేశారు.అవసరమైన మేర కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించారు.వారాహి యాత్రను ఎక్కువ రోజులు ఈ నియోజకవర్గంలోనే కొనసాగించారు.ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని సర్వేలు కూడా చేయించుకున్నారు. ప్రజల మనోగతాన్ని అంచనా వేసిన తరువాతనే పిఠాపురంని ఖరారు చేశారు. చివరికి పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతును కూడా కూడగట్టగలిగారు. ఇన్ని ప్రయత్నాలు చేసారు కాబట్టే జనసేన నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ వైసీపీ లెక్క మాత్రం మరోలా ఉంది. జూన్ 4న ఏం జరుగుతుందో చూడాలి.