మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్‌గా శృతిహాస‌న్‌.. త‌ర్వాత ఎవ‌రంటే?

క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా సినిమా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాస‌న్‌. తండ్రికి త‌గ్గ కూతురిగా చాలానే పేరు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, హిందీ భాష‌ల్లో చేతినిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇప్పుడు లాక్‌డౌన్‌లో త‌న ప్రియుడితో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ రికార్డు క్రియేట్ చేసింది ఈ భామ‌.

హైదరాబాద్ టైమ్స్‘ విభాగం ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టైటిల్ ను నెం.1 ప్లేస్‌తో ఎగ‌రేసుకుపోయింది శృతిహాసన్. శృతిహాస‌న్‌కు ఈ టైటిల్ రావ‌డం ఇది రెండోసారి. అంత‌కు ముందు 2013లో దీన్ని గెలుచుకుంది.

ఇక శృతి హాస‌న్ త‌ర్వాత అక్కినేని సమంత ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక ఈమె చెన్నై టైమ్స్ నిర్వ‌హించిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2020’ లో టాప్ లో నిలవ‌డం విశేషం. మూడో స్థానంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే, నాలుగో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది. అలాగే నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిన రష్మిక మందన్నా ఐదో స్థానంలో ఉంది. ఈమె ‘బెంగుళూరు టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ టైటిల్ గెలుపొందడం విశేషం.