Jagapathi Babu: ప్రకృతి పరిరక్షకుడు జగపతిబాబు..ఆసక్తికరంగా ‘సింబా’ ఫస్ట్ లుక్

-

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇరగదీస్తున్నారు. విలన్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ జగపతిబాబు ప్రజెంట్ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా ఉన్నారు.

ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింబా’. ఆదివారం..ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా మేకర్స్ ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెకకుతున్న ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు డైరెక్టర్‌ సంపత్‌ నంది స్టోరి అందించారు. మురళీ మనోహర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ సమర్పణలో రాజ్ దాస‌రి ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సంపత్‌ నంది, రాజేందర్‌ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

ఈ మూవీలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును చూపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్తున్న జగపతి బాబు చూపులు ఇంటెన్స్ గా ఉన్నాయి. ‘ప్రకృతి తనయుడు ఇతను…జగపతిబాబును ‘సింబా’గా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ ‘సింబా’ను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news