NSR పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ దాడి

-

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎన్ఎస్ఆర్ పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. కేంద్రంలో తయారయ్యే.. పాలు, ఇతర పాల పదార్థాల తయారీ విధానాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ మేరకు అధికారులు డైరీ ఫామ్‌ను సీజ్ చేశారు. కేంద్రంలో తయారు చేసే పాల పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా గుడెప్పాడ్‌లోని ఎన్ఎస్ఆర్ పాల డైరీ కేంద్రంలో చోటు చేసుకుంది.

nsr-dairy
nsr-dairy

రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారని ఫుడ్ కంట్రోల్ బోర్డ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సీనియర్ సైంటిఫిక్ అధికారి లక్ష్మినారాయణ రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత, వరంగల్-హనుమకొండ జిల్లాల ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో గడువు ముగిసిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరికొన్ని పాల ప్యాకెట్లపై లేబుల్స్ లేకపోవడం గుర్తించారు. ఈ మేరకు అధికారులు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించని ఎన్ఎస్ఆర్ డైరీ ఫుడ్ లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news