జై భీమ్ కు ప్రశంస‌లు తెలిపిన సీత‌క్క‌! స్పందించిన సూర్య

-

స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర లో వ‌చ్చిన జై భీమ్ ఇటీవ‌ల అమెజ‌న్ ప్రైమ్ అనే ఓటీటీ లో విడుద‌ల అయి సంచ‌ల‌నాల‌ను సృష్టి స్తుంది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెల‌ప కుండా ఉంట‌లేరు. ఇప్ప‌టికే చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రటీలు చిత్ర బృందం పై ప్ర‌శంస‌లు కురిపించారు. తాజా ములుగు ఎమ్మెల్యే సీత‌క్క కూడా ట్విట్ట‌ర్ వేదిక గా జై భీమ్ చిత్ర బృందం పై ప్ర‌శంస‌లు కురిపించింది. క‌ళ్లు క‌ట్టిన‌ట్టు సినిమా చూపించార‌ని అంది.

అలాగే జై భీమ్ సినిమా లో ప్ర‌తీ పాత్ర ను తాను నిజ జీవితం లో చూసాన‌ని సీతక్క అంది. అలాగే ఈ సినిమా లో చూపించిన బాధ‌లు నిజ‌మేన‌ని అన్నారు. అలాగే జై భీమ్ చిత్ర బృందానికి ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ట్వీట్ కు జై భీమ్ సినిమా హీరో సూర్య స్పందించాడు. సీత‌క్క ఫోస్టు కు రిప్లే కూడా ఇచ్చాడు. సీతక్క కు ధన్యవాదాలు అని సూర్య కామెంట్ రాశాడు.

Read more RELATED
Recommended to you

Latest news