గూఢచారి 2 నుంచి ఆరు క్రేజీ స్టిల్స్.. విడుదల అప్పుడే..!

-

టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ కథానాయకుడిగా నటించిన మూవీ గూఢచారి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా గూఢచారి 2 సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినయ్ కుమార్ సిరిగినీడు దర్శకుడు.

గూఢచారి కథ మొత్తం భారతదేశంలో జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గూఢచారి విడుదలై నేటికి ఆరేళ్లు అవుతుంది. దీంతో తాజాగా గూఢచారి 2 నుంచి ఆరు స్టిల్స్ విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశముంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version