IMDb పాపులర్ సెలెబ్రిటీ లిస్ట్.. షారుక్ ను బీట్ చేసిన శోభితా ధూళిపాళ్ల

-

ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల లేటెస్ట్ జాబితా విడుదలైంది. ఈ లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ బ్యూటీ శర్వరీ వాఘ్ నిలిచింది. ఇటీవలే ఈ భామ ముంజ్యా అనే మూవీలో నటించింది. దీంతో శర్వరీ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఇక ఈ భామ తర్వాత అనూహ్యంగా రెండో స్థానంలో టాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ నిలిచింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఈమె గురించి చర్చ ఎక్కువగా నడిచింది.

అసలు ఈమె ఎవరు? ఏం చేస్తుందని నెటిజన్లు ఎక్కువగా ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈ వారం లిస్ట్లో శోభిత ధూళిపాళ దూసుకెళ్లింది. అయితే ఈ బ్యూటీ షారుక్ ఖాన్ను ఈ లిస్టులో వెనక్కి నెట్టేసింది. ఈ జాబితో బాలీవుడ్ బాద్షా షారుక్ మూడో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, జాన్వీ కపూర్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా.. పారిస్ ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ ఈ ఈ జాబితాలో టాప్-10లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news