తెలుగమ్మాయి ఘాటు ముద్దులు.. వెబ్ సీరీస్ తో రచ్చ..!

-

తెలుగు అమ్మాయే అయినా ఇక్కడ పుట్టి నార్త్ లో పెరిగి అక్కడ కల్చర్ బాగా అలవరచుకున్న శోభిత ధూళిపాళ తెలుగులో గూఢచారి సినిమాతో తళుక్కున మెరిసింది. ఇక ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలేమి అందుకోని ఈ అమ్మడు అమేజాన్ ప్రైం నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో నటించింది. మేడిన్ హెవెన్ అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్న శోభిత అందులో వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తుంది.

ఇందులో మేల్ లీడ్ గా చేస్తున్న అర్జున్ మాథుర్ కూడా వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తున్నాడు. ఇద్దరు కలిసి చేసిన ఈ మేడిన్ హెవెన్ వెబ్ సీరీస్ లో శొభిత అందాలను గుమ్మరించింది. అంతేకాదు లిప్ లాకులతో రచ్చ చేసింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ వెబ్ సీరీస్లో తెలుగమ్మాయి ఘాటు ముద్దులు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. త్వరలో ప్రైం లో రానున్న ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది. మరి ఆన్ లైన్ ప్రియులకు ఈ వెబ్ సీరీస్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news