పేద స్టూడెంట్ల కోసం సోనూసూద్ గొప్ప నిర్ణ‌యం.. ఆ కోర్సు ఫ్రీ!

-

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క ఆప‌ద్భాంద‌వుడి పేరు సోనూసూద్ Sonu Sood . ఎన్నో కోట్లు వెచ్చించి మ‌రీ పేదోళ్ల‌కు సాయం చేస్తున్నాడు సోనూ. అందుకే ఆయన్ను రియల్ హీరోగా కొలుస్తున్నారు అభిమానులు. పోయినేడాది లాక్ డౌన్ టైమ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన సాయం అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. ఆయ‌న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అంద‌రికీ విస్త‌రిస్తూనే ఉన్నారు.

అనేక మార్గాల ద్వారా పేదోళ్ల‌కు ఉపాధి చూపించి సాయం అందిస్తున్నారు సోనూసూద్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయ‌న సీఏ చ‌ద‌వాల‌నుకునే పేద స్టూడెంట్ల కోసం కోసం గొప్ప నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. త‌మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలోనే సీఏ ఫ్రీ కోచింగ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇందుకోసం కోచింగ్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్న‌ట్టు సోనూసూద్ తెలిపారు. ఈ సెంట‌ర్ల‌లో ఇంట‌ర్న్‌షిప్‌, కోచింగ్‌, ప్లేస్‌మెంట్‌ల‌ను పొందుప‌రిచి, వాటిని విద్యార్థుల‌కు ఇప్పిస్తామ‌ని వివ‌రించాడు. త‌మ ట్రస్టు స‌మ‌క్షంలోనే పేద విద్యార్థుల‌కు వీటిని అందిస్తామ‌ని వివ‌రించారు సోనూసూద్‌. ఎవరైనా సీఏ చ‌ద‌వాల‌నుకుంటే వారు త‌మ ట్ర‌స్టు వెబ్‌సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకుంటే వారి బాధ్య‌త తామే చూసుకుంటామ‌ని సోనూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news