మ‌రోసారి మ‌న‌స్సులు దోచిన సోనుసూద్.. ఏం చేశాడంటే…?

-

సంక్షోభ సమయంలో ప్రజలకు తన శక్తి మేర సాంత్వన కలిగించిన రియల్ హీరో సోనుసూద్ ( Sonu Sood )  . ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో సతమతమయ్యారు. భారత్‌లోనూ ప్రజలు తీవ్రమైన అవస్థలు పడ్డారు. ముఖ్యంగా లాక్‌డౌన్ టైంలో జనాలు తమ జీవనం ఆగమ్యగోచరంగా మారిందని అనుకుంటున్న క్రమంలో వారికి కావాల్సినవి అన్ని అందించి తన వంతు సాయం చేశాడు సోనుసూద్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనును ప్రముఖులు, ప్రజలు అభింనందించగా, తెలంగాణలో సోనుకు విగ్రహం కట్టించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఇటీవల ట్విట్టర్ వేదికగా వలస కూలీల దేవుడు సోనుసూద్ చేసిన ట్వీట్ ఒకటి తెగ వైరలవుతోంది. అదేంటో ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.

 

sonu sood | సోనుసూద్
sonu sood | సోనుసూద్

పిలిస్తే పలికే దైవం సోనుసూద్ అంటూ..వలస కూలీల ఆపద్బాంధవుడు సోను అంటూ..సోషల్ మీడియా వేదికగా సోనుసూద్ ను వేల మంది ప్రజలు కీర్తించిన, కీర్తిస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. లాక్ డౌన్ కాలంలో ఆపద వచ్చిన ప్రతీ ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేసిన సోను నిజమైన హీరో. పలు భాషల్లో విలక్షణ పాత్రలు పోషించిన రీల్ విలన్ సోనుసూద్ తెలుగింటి అల్లుడు. ఇటీవల ఆయన ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు.

తన తల్లి బర్త్ డే సందర్భంగా ఆమెతో ఉన్న క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘అమ్మా..నేను నీకు వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నా. మీరు నేర్పించిన లైఫ్ లెస్సన్స్‌కు థాంక్స్ చెప్తున్నాను. అమ్మా నేను నిన్ను ఈ రోజు ఎంతో మిస్ అవుతున్నాననేది ఎప్పటికీ వ్యక్తపరచలేను అమ్మా.. నువ్వు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసినప్పుడే ఆ శూన్యం ఫిల్ అవుతందమ్మా’ అని భావోద్వేగ సందేశం పెట్టాడు. నువ్వు ఎక్కడున్నా..ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని సోనుసూద్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూస్తే ప్రతీ ఒక్కరి గుండెలు బరువెక్కుతాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news