టాలీవుడ్ లో సౌండ్ పొల్యూషన్… అదే లాస్ట్ డేట్!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇండస్ట్రీ జనాలు – ఇండస్ట్రీ పెద్దలు.. ఎవరి ప్రయోజనాలకోసం ఈ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు.. ఇండస్ట్రీ కి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా రాజకీయాలను చేర్చేశారా? ఇకపై ఇండస్ట్రీ కూడా అధికారపక్షం – ప్రతిపక్షం లా మారనుందా? అంటే… అవుననే సమాధానాలు వస్తున్నాయి!

ప్రత్యక్షంగా చెప్పుకున్నా పరోక్షంగా చెప్పుకున్నా… పవన్ గొంతెత్తినా – పోసాని నోరెత్తినా… వాటి వెనుక లక్ష్యం “మా” ఎన్నికలు అనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. అంచనాలకు భిన్నంగా – అనూహ్యంగా వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి యాంటీ పవన్ బ్యాచ్ – ప్రో జగన్ బ్యాచ్ తెర మీదకు వస్తున్నారు. అయితే అది బయటకు కనిపించేదే! ఇక్కడ పరోక్షంగా యాంటీ ప్రకాశ్ రాజ్ ప్యానల్ బ్యాచ్ – ప్రో మంచు విష్ణు ప్యానల్ బ్యాచ్ గా మారిందంట.

అవును.. హద్దులు దాటిన ఆవేశంతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్న మాటల మాటున దాగిన రహస్య అజెండా అదేనంట. వచ్చే నెల 10న జరగాల్సిన “మా” ఎన్నికల్లో ఒక ప్యానల్ ను ఇబ్బంది పెట్టటానికి.. మరో ప్యానల్ కు మేలు జరగడానికి వీలుగా.. ఇప్పుడీ కొత్త రచ్చను అంతకంతకూ పెంచి పెద్దది చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. పవన్ గొంతు చించుకుని జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోసినా – పోసాని మైకందుకుని పవన్ ని కడిగిపారేసినా… ఆ మాటల మాటున దాగున్న లక్ష్యం మాత్రం “మా ఎన్నికలే” అంట!

ఎవరు అవునన్నా కాదాన్నా… ఈ వ్యవహారం మొత్తం అక్టోబరు 10 వరకు కొనసాగుతుందని.. అప్పటివరకు ఈ టార్చర్ తెలుగు ప్రజలకు తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు! ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… అక్టోబర్ 10 వరకు ఆవేశాలతో ఊగిపోయిన వారంతా రిజల్ట్ తర్వాత కనిపించకుండా పోతారంట. కానీ.. వారి ట్రాప్ లో పడిన అమాయక అభిమానులు మాత్రం ఆ భారాన్ని మోస్తూ దాని చుట్టూనే తిరుగుతుంటారని చెబుతున్నారు. కాబట్టి… ఈ “మా” రచ్చ లో అభిమానులు మిన్నకుంటే మంచిది! లేదంటే… పంజాగుట్ట స్టేషన్ లో బెయిల్స్ కోసం ఎదురుచూడాలి.. అవసరమా?

Read more RELATED
Recommended to you

Latest news