అభిమానులకు యంగ్ హీరో నిఖిల్ క్షమాపణలు.. ఎందుకంటే..?

-

కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవలే స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే నిఖిల్​.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు, తన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. సోషల్​ మీడియాలో ఓ నోట్​ను రిలీజ్ చేశాడు. ఇంతకీ నిఖిల్ తన ఫ్యాన్స్ కు సారీ ఎందుకు చెప్పాడంటే..

“నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్/కంటెంట్ డీలే సమస్యల కారణంగా.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో సినిమాను ​ విడుదల చేయలేకపోయాం. అది నాకెంతో బాధనిచ్చింది. ఓవర్సీస్​లోనూ 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో పర్ఫెక్ట్‌గా, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. అదీ ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా. ఓ మంచి క్వాలిటీ సినిమాను మీకు అందిస్తాను” అని నిఖిల్​ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news