చరణ్ ఐటెం ఎవరు..?

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. రంగస్థలం హిట్ తో మంచి జోష్ లో ఉన్న చరణ్ ఈ సినిమాను హిట్ కొట్టేలా చూస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందట.

ఈ సాంగ్ కు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ నర్తిస్తుందని అంటుండగా కేథరిన్ త్రెసా కూడా ఈ ఐటం లో చరణ్ తో జత కడుతుందని అంటున్నారు. శ్రద్ధా, కేథరిన్ ఇద్దరిలో ఎవరు ఈ ఐటం సాంగ్ చేస్తారో తెలియాల్సి ఉంది. వినయ విధేయ రామా టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో రిలీజ్ అవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news