నితిన్ ‘రాబిన్​హుడ్’ మూవీలో శ్రీలీల.. బాస్ లేడీ గ్లింప్స్ అదుర్స్

-

టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్​గా మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో దూసుకెళ్లిన శ్రీలీల.. ఇప్పుడు కాస్త స్లో అయిపోయింది. వరుస ప్లాఫ్​లతో ఈ భామ తన కెరీర్ గాడిని స్లో చేసింది. కానీ అవకాశాలకు మాత్రం ఈ బ్యూటీకి కొదువలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్​, రవితేజ 75వ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీలీల మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజాగా ఈ భామ నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్​హుడ్ మూవీకి పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించిన గ్లింప్స్​తో అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా వచ్చింది. ఇవాళ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రాబిన్ హుడ్ టీమ్ స్పెషల్​ బర్త్​డే విషెస్ తెలుపుతూ ఓ గ్లింప్స్​ను విడుదల చేసింది. ఇందులో శ్రీలీల అల్ట్రా స్టైలిష్​ లుక్​లో ఫుల్​ రిచ్ అండ్​ గ్లామర్​గా కనిపిస్తూ బాస్ లేడీ వైబ్స్ ఇచ్చింది. ఓ ఫ్లైట్​ నుంచి దిగి నడుస్తూ ‘సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి’ అంటూ వెన్నెల కిశోర్​తో చెప్పిన​ డైలాగ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news