కాటుక కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తున్న శ్రీలీల

-

టాలీవుడ్ లో ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఈ భామ ప్రస్తుతం దాదాపు డజను సినిమాల్లో నటిస్తోంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఈవెంట్లు.. ఇంకోవైపు షాపు ఓపెనింగ్స్.. ఇలా చేతి నిండా పనితో బిజీ బిజీగా గడుపుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ కన్నడ బ్యూటీ అక్షరాలా పాటిస్తోంది.

ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇంతటి బిజీ షెడ్యూల్ లోనూ ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో శ్రీలీల వైట్ కలర్ లెహంగాలో కనిపించింది. ట్రెడిషన్ ఔట్ ఫిట్ లో ఈ భామ భలే ముద్దుగా కనిపించింది. కాటుక కళ్లతో కుర్రాళ్లను మాయ చేసింది. ఇక నడుం అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు గుండె జారి గల్లంతయ్యిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీలను పంపిస్తూ కామెంట్ బాక్సును నింపేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news