ఆ దర్శకుడికి మద్దతుగా.. విశాల్‌పై పడ్డ శ్రీరెడ్డి!

-

తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరమే లేని పేరు శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ అప్పట్లో అందరిపైనా ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్, నాని, విశాల్, లారెన్స్ ఇలా ఇష్టమొచ్చిన వారిపై కామెంట్స్ చేసింది. అదే సమయంలో విశాల్‌పైనా విరుచుకపడింది. పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టడం, ఇక్కడి మీడియా శ్రీరెడ్డిని పట్టించుకోకపోవడంతో కోలీవుడ్‌కు చెక్కేసింది.

తాజాగా శ్రీ రెడ్డి మళ్లీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి, శ్రీ రెడ్డి వ్యవహారం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఆ విషయాలు కాసేపు పక్కనపెడితే విశాల్-డైరెక్టర్ మిస్కిన్ మధ్యా ఓ వివాదం జరిగింది. బడ్జెట్ పరిమితులు దాటేలా అనవసరపు ఖర్చులు చేస్తున్నాడని తుప్పరివాలన్ 2 (డిటెక్టివ్ 2) మూవీ నుంచి మిస్కిన్‌ను తప్పించాడు.

వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో తాజాగా శ్రీ రెడ్డి ఎంటరైంది. తాను ఎల్లప్పుడూ దర్శకులకే మద్దతిస్తానని, ఈ సారి తమిళ దర్శకుడు మిస్కిన్‌కు నా సపోర్ట్ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. మరికాసేపటికే.. విశాల్ ఇంత డబ్బు నువ్వు ఎలా సంపాదించావ్ అంటూ మరో పోస్ట్ చేసింది. ఇలా మరోసారి విశాల్‌ను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news