ఆ సీఎం కొడుకుతో రిలేషన్లో ఉన్నానంటున్న శ్రీరెడ్డి ..!

-

టాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించి పాపులారిటీ సంపాదించుకోలేకపోయిన వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరు.. కానీ ఎప్పుడైతే క్యాస్టింగ్ కౌచ్ పై మీటూ ఉద్యమం చేసి ఎంతో మంది స్టార్ హీరోల పైన హాట్ కామెంట్స్ చేసిందో .. దాంతో ఈమె పేరు పాపులర్ అయ్యేలా చేసుకుంది. ఎప్పుడు సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ మెగా హీరోల పైన ఇతర హీరోల పైన ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. అప్పుడప్పుడు రాజకీయాల పైన కూడా స్పందిస్తూ గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.

ఇప్పుడు తాజాగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి . ఈసారి ఏకంగా తనకు ఆ పొలిటిషన్ తో రిలేషన్ ఉందంటూ బాంబు పేల్చింది శ్రీరెడ్డి.. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్.. దాదాపుగా ఉదయినిధికి తనకు మూడేళ్ల క్రితం నుంచి మంచి పరిచయాలు ఉన్నాయని.. తనతో గడిపిన ప్రతి మూమెంట్ కూడా తనకు బాగా నచ్చుతుందని చెప్పేవాడని తెలిపింది శ్రీరెడ్డి..

తనకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తనని లొంగ తీసుకున్నారని.. ఆ తర్వాత తనతో అవసరం తీరిపోయాక మరచిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి . ఏకంగా సీఎం కొడుకుతోనే ఇలా రిలేషన్ ఉందంటూ శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. మరి ఈ విషయం పైన ఎవరు స్పందిస్తారో చూడాలి మరి. శ్రీ రెడ్డి చాలామంది హీరోల పైన కూడా ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news