బంగ్లాదేశ్ క్రికెట్ టీంకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ లో భాగంగా నేడు పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గడ్డాఫీ స్టేడియం, లాహోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్ నేపథ్యలోనే బంగ్లాదేశ్ క్రికెట్ టీంకు గట్టి ఎదురుదెబ్బ తాకింది.

ఆ జట్టు కీలక ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ శాంటోకు తొడ కండరాల గాయమైంది. దీంతో నజ్ముల్ ఆసియా కప్ టోర్నీ నుంచి వెనుదిరిగారు. ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన నజ్ముల్… గాయం కారణంగా ఆ తర్వాత ఫీల్డింగ్ చేయలేదు. డాక్టర్లు స్కానింగ్ చేయగా తొడ కండరాలు చిట్లినట్లు తేలింది. దీంతో నజ్ముల్ స్థానంలో లిటన్ దాస్ ను టీం లోకి తీసుకున్నారు.