ఎవడైనా ఓకే.. వాడితో సంవత్సరమే.. కానీ నో పెళ్లి: శ్రీరెడ్డి

నా తల్లిదండ్రులను తప్పించి ఇంకెవరినీ నేను ప్రేమించను. ఒకవేళ నాకు ఎవరైనా నచ్చితే వాడితో ఓ సంవత్సరం డేట్ చేస్తా అంతే. తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకే నాకు పెళ్లి అంటే కూడా ఇష్టం లేదు.

నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అవసరం లేదు కదా. మీకే ఆమె గురించి ఎక్కువగా తెలుసు. కాస్టింగ్ కౌచ్‌పై ఆమె చాలారోజుల నుంచి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులపై ఆమె చాలా ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంటుంది.

తాజాగా.. తన గురించే ఓ పోస్ట్ పెట్టి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది శ్రీరెడ్డి. తన తల్లిదండ్రులను తప్పించి ఇంకెవరినీ శ్రీరెడ్డి లవ్ చేయదట. అసలు తను ఏం పోస్ట్ పెట్టిందో తెలుసా?

నా తల్లిదండ్రులను తప్పించి ఇంకెవరినీ నేను ప్రేమించను. ఒకవేళ నాకు ఎవరైనా నచ్చితే వాడితో ఓ సంవత్సరం డేట్ చేస్తా అంతే. తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకే నాకు పెళ్లి అంటే కూడా ఇష్టం లేదు. నాకు ప్రతి సారీ కొత్త లవ్ కావాలి. నేను ప్లే గర్ల్. నో డ్రామా. నో కమిట్‌మెంట్. నో కన్ఫ్యూజన్.. అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఏంటి శ్రీరెడ్డి.. మరీ ఇలా పచ్చిగా మాట్లాడుతున్నావు. కాస్త నోరు అదుపులో పెట్టుకో.. అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయినా శ్రీరెడ్డికి ఇటువంటి మాటలు కొత్తేం కాదు కదా.