భారత్ ఖాతాలో రెండో విజయం.. ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్..!

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించి 117 పరుగులు చేసి భారత్ స్కోర్‌ను ఎక్కడికో తీసుకుపోయాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌తో పాటు కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పరుగుల వరద సృష్టించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో భారత్ విజయదుందుబి మోగించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ ఐసీసీ వరల్డ్ కప్‌లో ఎదురులేని జట్టుగా నిలుస్తోంది.

ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులను చేసింది. నిజానికి 352 పరుగులు అంటే భారీ స్కోర్. అయితే.. ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ను కూడా ఈజీగా కొట్టేస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ.. ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 316 పరుగులు మాత్రమే చేయగలిగింది. అందులోనూ ఆస్ట్రేలియా అన్ని వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాకు చెరో 3 మూడు వికెట్లు దక్కాయి. చాహల్ 2 వికెట్లు తీశాడు.

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించి 117 పరుగులు చేసి భారత్ స్కోర్‌ను ఎక్కడికో తీసుకుపోయాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌తో పాటు కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పరుగుల వరద సృష్టించారు. దీంతో భారత్ స్కోరు అమాంతం పెరిగింది. ఈ మ్యాచ్‌ను కూడా గెలవడంతో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది.