టాలీవుడ్ డ్రగ్స్ కలకలం.. లిస్ట్ బయటపెట్టేందుకు శ్రీరెడ్డి రెఢీ.. కాకపోతే..!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. తాజాగా ఆ సెగ టాలీవుడ్ కి కూడా తాకింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ఆమె రకుల్ సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిందని తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ అంశంపై తాజాగా.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. టాలీవుడ్‎లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని, పలువురు సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని ఆమె పేర్కొంది.

పెద్ద పెద్ద హోటల్స్‎లో పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్ వాడుతుంటారని ఆరోపించింది. అలాగే పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటున్నారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్‎లోని డ్రగ్స్ వాడే పేర్లను చెబుతానని శ్రీరెడ్డి తెలిపింది. ఈ మేరకు శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది.