శ్రీకాంత్ – ఊహ పెళ్లి జరగడం వెనుక ఇంత కథ ఉందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహ నటి ఊహను సినిమాలలో చేస్తున్నప్పుడే ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి తో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా వీరి ప్రేమ , పెళ్లికి ఎన్నో అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. వీరి మధ్య ఎన్నో సంవత్సరాలు రహస్యంగా ప్రేమ కొనసాగగా.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే శ్రీకాంత్ ను ఊహా కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఊహ తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకపోయినా.. ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వడంతో వారి పెళ్లి జరిగిందట.

 

 

శ్రీకాంత్.. ఊహ ఆమె అనే సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత 3 సినిమాలలో నటించినా.. ఎక్కడ కూడా వీరు తమ ప్రేమను బయట పెట్టలేదు. కానీ ఊహ తల్లిదండ్రులు అప్పటికే ఊహకి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లి చేయాలని చూడగా శ్రీకాంత్ తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉంది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఊహ ఇంటికి నేరుగా వెళ్లి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెబితే ఆమె తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదట. ఇక సినీ ఇండస్ట్రీ నుండి మా అమ్మాయికి భర్తని తీసుకురావడం మాకు ఇష్టం లేదని చెప్పారట.

దాంతో చాలా బాధపడ్డారు శ్రీకాంత్. కానీ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎలాగైనా సరే శ్రీకాంత్ , ఊహాలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని.. ఊహా పేరెంట్స్ తో మాట్లాడి శ్రీకాంత్ గురించి, ఆయన గొప్పతనం గురించి వారికి చెప్పారట. ఇక అలా వీరిద్దరి పెళ్లి చిరంజీవి వల్లే జరిగిందని సమాచారం. ఆ మధ్యకాలంలో శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించినా.. వాటిపై చాలా ఘాటుగా స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు శ్రీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news