తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అంగీకరిస్తే.. రానున్న రోజుల్లో చర్చలు ముందుకు సాగుతాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్ రావు ఠాక్రెతో కూనంనేని సాంబరావు సమావేశం అయ్యారు. తమ పార్టీ ప్రతిపాదనలను కాంగ్రెస్ వద్ద ప్రస్తావించామన్నారు.
చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయన్నారు. తమ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుందనే విషయాలను తమ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరిస్తే.. ఆ తరువాత చర్చల్లో వివరిస్తామన్నారు. తమ ప్రతిపాదనలపై కాంగ్రెస్ వైఖరి ముందు తేలాల్సిన అవసరముందన్నారు. సీపీఎం కాంగ్రెస్ పార్టీలో చర్చలు వేసే అవకాశముందన్నారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీతో చర్చించే అవకాశముందని.. అభిప్రాయపడ్డారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి చర్చించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
మునుగోడులో అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పొత్తు కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. ఈనెల 21న బీఆర్ఎస్ 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ పరిణామం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు షాక్ ఇచ్చింది.