దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులు బీసీలను వెనుకకు నెట్టివేశారని , సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కోకాపేట్‌లో రెండు ఎకరాల్లో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న పెరిక కుల సంఘం ఆత్మగౌర భవనానికి, పిర్జాదిగూడలో రూ.కోటితో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆత్మ గౌరవ భవనానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
సమాఖ్య పాలనలో బీసీలకు కేవలం 19 గురుకులాల్లో 7,500 మంది విద్యార్థులు మాత్రమే చదివే అవకాశముండగా నేడు స్వయం పాలనో 327 గురుకులాల్లో 1,80,000 మంది బీసీ బిడ్డలు అత్యున్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ద్వారా రూ . లక్ష రూపాయలను అందిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.
అంతేకాక, నేడు ఉప్పల్ పీర్జాదిగూడలో చాత్తాద శ్రీవైష్ణవులకు కేటాయించిన ఎకరం భూమి కోటి నిధులతో నిర్మించే ఆత్మగౌరవభవనానికి మంత్రులు గంగుల కమలాకర్ చామకూర మల్లారెడ్డి చేతులమీదుగా ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు, పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రులకు ఘన స్వాగతం పలికారు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చాత్తాద శ్రీ వైష్ణవులు, శంకుస్థాపన భూమి పూజ అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రులు.