స్టేజ్ పైనే శ్రీముఖికి చేదు అనుభవం.. పరువు తీసిన హీరోయిన్..!

-

ప్రముఖ యాంకర్ గా , నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బుల్లితెరపై వచ్చే షోలతోనే కాదు వెండితెరపై వచ్చే సినిమాలలో కూడా తన వంతు అలరించిందని చెప్పాలి. ఈమధ్య కాలంలో యాంకర్ గా అదుర్స్ అనే షో తో శ్రీముఖి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత అదుర్స్ టు, మనీ మనీ, సూపర్ మామ్, సూపర్ సింగర్ , జో లకటక, కామెడీ నైట్ , బొమ్మ అదిరింది, పటాస్ వంటి షో లు చేసి బాగా అలరించింది. ఇలా సుదీర్ఘకాలంగా టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అటు సినిమాలు ఇటు షోలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్న శ్రీముఖి ప్రస్తుతం ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ అనే షోకి టీం లీడర్గా వ్యవహరిస్తోంది.

ఇందులో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా చేస్తున్నారు . దీన్ని ఓంకార్ హోస్ట్ గా నడిపిస్తూ ఉండడం గమనార్హం . ఇక శ్రీముఖి తో పాటు యశ్ మాస్టర్, మోనాల్ గజ్జర్ ఇంకో రెండు టీం లకు లీడర్లుగా చేస్తున్నారు. ఇందులో శ్రీముఖి తనదైన శైలిలో అలరిస్తూ తన అందాలను ఆరబోసేందుకే ఈ షో చేస్తోంది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఎప్పుడు చూడని విధంగా మాట్లాడుతూ .. డాన్స్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలెట్ అవుతుందని చెప్పవచ్చు. డాన్స్ ఐకాన్ షోలో 13 , 14 ఎపిసోడ్ లకు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ తాజాగా విడుదల చేసింది.

ఇందులో ఓ పాటకు జడ్జిలు రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ తో కలిసి.. టీం లీడర్లు యశ్ మాస్టర్ తో శ్రీముఖి కలసి డాన్స్ చేసింది. అది అయిపోయిన వెంటనే శేఖర్ మాట్లాడుతూ..” శ్రీ నువ్వు ఏమైనా మర్చిపోయావా? వాచ్ కానీ.. ఫోన్ కానీ ఏమైనా మర్చిపోయావా? ” అంటూ అనడంతో ఆమె సిగ్గు పడింది. ఆ తర్వాత రమ్యకృష్ణ కూడా నవ్వుకుంటూ..” కింద ఫ్యాంట్ ఏది? నేను చెప్పలేదు.. శేఖర్ మాస్టర్ చెప్పారు.. నువ్వు ప్యాంట్ మర్చిపోయావని” అని చెప్పి శ్రీముఖి పరువు తీసేసింది రమ్యకృష్ణ. ఆ తర్వాత యశ్ మాట్లాడుతూ “జడ్జి సీటులోనే ఉన్న మోనాలతో.. మోనాల్ నీ పక్క సీటులో ప్యాంటు వుంది తీసుకురా ” అని అన్నాడు. అలా అందరూ ఈమె ఫ్యాంటుని హైలెట్ చేయడంతో శ్రీముఖి కి కాస్త చేదు అనుభవం ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news