శ్రీను వైట్ల పేరు చెప్తే వరసగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ గుర్తొస్తుంది. రవితేజ తో మొదలైన శ్రీనివైట్ల సినీ ప్రయాణం అతి కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు. రవితేజ తో నీకోసం, దుబాయ్ శీను, వెంకీ, అమర్ అక్బర్ ఆంటోని… నాగార్జున తో కింగ్, వెంకటేష్ తో నమో వెంకటేశ, మెగాస్టార్ చిరంజీవి తో అందరివాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు తో దూకుడు, ఆగడు, ఎన్.టి.ఆర్ తో బాద్ షా, మంచు విష్ణు తో ఢీ, రాం తో రెడీ వంటి సినిమాలు తీశాడు.
అయితే కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా ఎదిగాడో అంతే ఫాస్ట్ ఫా ఫేడవుట్ అయ్యాడు. మహేష్ బాబు తో దూకుడు ఒక సెన్షేషన్ ని క్రియోట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన ఆగడు అడ్రస్ లేకుండా పోయింది. ఈ రెండు సినిమాల మద్యలో వచ్చిన ఎన్.టి.ఆర్ బాద్ షా కూడా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో నిర్మాతలు, హీరోలు శ్రీను వైట్ల ని దూరం పెట్టారు. అయినా మళ్ళీ రవితేజ శ్రీను వైట్ల కి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అదే అమర్ అక్బర్ ఆంటోని. ఈ సినిమా కి ముందు ఇద్దరు ఫ్లాపుల్లో ఉండటం తో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కాని ఈ సినిమా ఇద్దరికి షాకిచ్చింది. అందుకు కారణం శ్రీను వైట్ల అని అన్నారు.
అయితే శ్రీను వైట్ల ఇండస్ట్రీలో ఈ రేంజ్ కి రావడానికి కారణం అక్కినేని నాగార్జున. శ్రీను వైట్ల మొదటి సారి దర్శకుడిగా పరిచయమవుతూ రవితేజతో నీకోసం సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా కి శ్రీను వైట్ల చాలా కష్టపడ్డాడు. అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఉన్న డబ్బులు పెట్టి నీకోసం సినిమాని తీశారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యోసరికి 30 లక్షల పైనే అయింది. ఈ సినిమాని చూసిన రామోజీరావు నీకు సినిమా ఇస్తానని మాటిచ్చారు. అలాగే ఈ సినిమా రిలీజయ్యాక కోటి రూపాయలని వసూళ్ళు చేసింది.
అయితే ఆ సమయంలో ఇదే సినిమాని చూసిన నాగార్జున .. సినిమా చాలా బావుంది కాని కామెడీ తగ్గింది. నెక్స్ట్ సినిమా నుండి మంచి కామెడి ట్రాక్ ఉండేలా చూసుకో స్టార్ డైరెక్టర్ వి అవుతావు. నేను నీకు సినిమా ఇస్తా అని మాటిచ్చారట. అన్నట్టుగానే నాగార్జున కింగ్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇక రామోజీరావు ఇచ్చిన ఆనందం సినిమా నుండి మంచి కామెడి ట్రాక్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. కాని రాను రాను అదే సినిమా మొత్తం లో ఎక్కువై శ్రీను వైట్ల కి వరస ఫ్లాప్స్ తెచ్చిపెట్టింది.