దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేసింది. తాను చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు చెప్పాడు. జపాన్లో ఓ భూకంపం నుంచి తాను సేఫ్గా బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. మొదటిసారి భూకంపం ఎక్స్పీరియన్స్ను చేశామని తెలిపాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం జపాన్కు జక్కన్న కుటుంబం వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ హోటల్లో ఉన్న సమయంలో భూకంపం వచ్చినట్లు, తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ ఫొటో తీసి కార్తీకేయ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రాజమౌళి ఆయన కుటుంబం సేఫ్గా ఇండియాకు తిరిగి రావాలని ఆకాక్షింస్తున్నారు.
“జపాన్లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశాం. మేం 28వ అంతస్తులో ఉండగా బిల్డింగ్ మెళ్లిగా కదలింది. ఆ తర్వాత ఇది భూకంపం అని అర్ధం అయింది. నేను చాలా భయపడ్డాను. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఏదో వర్షం పడటం మొదలవుతోంది అన్నట్టుగా క్యాజువల్గా ఉన్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్పీరియెన్స్ చేశాం” అంటూ కార్తికేయ తన పోస్టులో రాసుకొచ్చాడు.