అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అమెరికా

-

భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ సందర్భంగా డ్రాగన్ దేశం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెబుతూ మద్దతుగా నిలిచింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ తెలిపారు.

అరుణాచల్‌ప్రదేశ్‌పై గతకొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ షియాంగాంగ్‌ ాదనలకు దిగగా భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. అనిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని కౌంటర్ ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news