లంగా తో స్టార్ హీరో అక్షయ్ కుమార్ డాన్స్.. మండిపడుతున్న అభిమానులు..

-

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ముఖ్యంగా అభిమానులు స్టార్ హీరోలకు ఇచ్చే విలువ చూస్తే మతిపోతుంది. తమ అభిమాన హీరో కనిపిస్తేనే చాలు సంబరపడిపోతారు. అయితే ఇంతలా అభిమానించే హీరోలు సైతం ఏమాత్రం ఇబ్బంది పెట్టే పని చేసిన అభిమానులు సహించలేరు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఎదుర్కొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై నెటిజనలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు అసలు కారణం ఏంటంటే.. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ఓ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లారు. ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అక్షయతో పాటు బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహీ, సోనమ్‌ బజ్వా, మౌనీ రాయ్‌, దిశపటానీ లాంటి ఇంకొంత మంది స్టార్స్ కూడా ఆ టూర్‌లో ఉన్నారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్ రెండు రోజుల క్రితం అట్లాంటాలో ఓ డాన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు.

అయితే ఇందులో అక్షయ్ కుమార్ చేసిన డాన్స్ వీడియో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో అక్షయ్‌ కుమార్‌ లంగా వేసుకుని ఉన్నారు. ఆ లంగాలోనే మై ఖిలాడీ.. తు అనారీ పాటకు డ్యాన్స్‌ చేశారు. అక్షయ్‌ లంగా వేసుకుని డ్యాన్స్‌ చేయటంపై ఫ్యాన్స్ తమ అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నెటిజన్లు అయితే ఈ విషయంపై ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. ఈ డాన్స్ చూసి సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు ఇందులో ముఖ్యంగా.. అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నారు అక్షయ్.. ఇలా చేయడం వల్ల అభిమానులు ఏమనుకుంటారో.. అని ఆలోచించారా.. అంటూ తెగ కామెంట్లు పెట్టడమే కాకుండా అక్షయ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news