స్టార్ హీరో కూతురు కూడా రొమాన్స్ కి రెడీ అవుతుంది ..తప్పదుగా మరీ ..?

-

సినీ పరిశ్రమలో వారసులు రావడం కొత్తేమీకాదు. ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్, ఆర్, కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తున్నదే .. చూస్తున్నదే. స్టార్ హీరోల కొడుకులు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం ని సంపాదించుకొని సక్సస్ అయ్యారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు కొడుకు అరుణ్ కుమార్, నందమూరి ఫ్యామిలీలో తారక రత్న వంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. అంతేకాదు అలనాటి హీరో, హీరోయిన్స్ కూతుళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు .. వెలుగుతున్నారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, శరత్ కుమార్ ల తో పాటు అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి లాంటి స్టార్స్ కూతుళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.

 

వీళ్ళ లాగానే మరో స్టార్ హీరో అర్జున్ తెలుగులో త‌న కూతురిని ప‌రిచ‌యం చేయబోతున్నారు. అర్జున్ కి అటు తమిళం లో ఇటు తెలుగులో చాలామంది ద‌ర్శకులు, నిర్మాత‌ల‌తో మంచి అనుబంధం ఉంది. దాంతో త‌న కూతురిని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయమని అడుగుతున్నారట. ఈ విషయంలో అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ జగపతి బాబు ని కూడా రికమెండ్ చేయమని అడుగుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐశ్వర్య హైద‌రాబాద్ వ‌చ్చి కొంత‌మంది ద‌ర్శక నిర్మాతలని క‌లవడం .. కొన్ని ఫోటో షూట్స్ కూడా నిర్వహించడం జరిగిందట.

ఇక తాజాగా ఐశ్వర్య .. అర్జున్ విడుదల చేసిన ఫోటోషూట్స్ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఐశ్వర్య హాట్ ఫోటోషూట్‌ను ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న కొందరు పీఆర్‌వోలు మేకర్స్ కి చూపిస్తూ వివరాలు తెలుపుతున్నారట. అంతేకాదు త్వరలో మరిన్ని ఫోటోషూట్‌లు కూడా నిర్వహించి వాటితో తెలుగు మేకర్స్ ని అప్రోచ్ అవబోతుందని తెలుస్తుంది. మరి ఐశ్వర్య కి టాలీవుడ్ లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చే మేకర్స్ అండ్ హీరో ఎవరో చూడాలి. ఇక అర్జున్ అటు తమిళంలో ఇటు తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మరి అర్జున్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news