చెల్లెలు డైరెక్ష‌న్లో సినిమా చేస్తానంటున్న స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో తెలుసా?

క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా సినిమా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాస‌న్‌. తండ్రికి త‌గ్గ కూతురిగా చాలానే పేరు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, హిందీ భాష‌ల్లో చేతినిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇప్పుడు లాక్‌డౌన్‌లో త‌న ప్రియుడితో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స‌రస‌న సలార్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోంది. ఈ గ్యాప్‌లో సోష‌ల్ మీడియా ద్వార అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇక ఇప్పుడు తన చెల్లి అక్ష‌ర హాస‌న్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాన‌ని చెబుతోంది శృతిహాసన్. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో చిట్‌చాట్ చేసింది శృతి. ఈ సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు జ‌వాబుగా త‌న చెల్లెలు అక్షర హాసన్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయాల‌ని ఉందంటూ చెప్పింది ఈ క్యూబ్ బేబీ. మంచి క‌థ వ‌స్తే త‌ప్ప‌కుండా చెల్లితో సినిమా చేస్తానంటోంది.