నాని ‘జెర్సీ’ని కాదన్న స్టార్స్..!

-

టైటిల్ చూసి నానికి చెప్పడానికి ముందే గౌతం తిన్ననూరి ఈ కథను వేరే స్టార్స్ కు చెప్పి ఉండొచ్చు వాళ్లు వీళ్లు కాదంటే నాని దగ్గరకు వచ్చి ఉండొచ్చని అంచనా వేయొచ్చు. నాని కోసం గౌతం తిన్ననూరి రాసిన కథ జెర్సీ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం మాత్రం చాలామందిని అడగాల్సి వచ్చిందట. నాని పక్కన నటించడానికి స్టార్ హీరోయిన్స్ సైతం రెడీ అంటారు కాని జెర్సీ సినిమాలో 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడికి తల్లిగా చేయాల్సి ఉంది.

అందుకే ఒకరిద్దరు స్టార్ హీరోయిన్స్ దగ్గరకు వెళ్లినా వాళ్లు వద్దన్నారట. ఇంకో స్టార్ హీరోయిన్ పెళ్లైతే ఓకే కాని పిల్లాడు అంటే కష్టమని చెప్పిందట. అందుకే కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశారు. కన్నడ యూటర్న్ సినిమాతో పాటుగా తమిళంలో విక్రంవేద సినిమాలో నటిగా మెప్పించింది శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాలో నానికి సమానంగా నటించి మెప్పించిందట శ్రాధా శ్రీనాథ్. నాని పక్కన నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అంటూ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news