అన్నీ అబద్దాలే.. కోటిపై తెలంగాణ డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

52

ఏపీ ఎన్నికల సందర్భంలో లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తుందంటూ ఆమె అనుచరుడు కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా లక్ష్మీ పార్వతి ఇప్పుడు తనపై దుష్ప్రచారం జరిగిందని, తనకు న్యాయం కావాలని తెలంగాణ డీజీపీని కోరింది. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని తాను బిడ్డగా భావించానని చెప్పారు. తనని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేశారని, కోటి చేసిన దుష్ప్రచారం తనకు బాధ కలిగించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీని వెనుక ున్న కుట్రలను చేధించి, తన పరువు మర్యాదలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని లక్ష్మీ పార్వతి డీజీపికి విన్నవించారు.

తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ  గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తను లక్ష్మీ పార్వతికి అనుచరుడినంటూ పేల్చిన బాంబు సంచలనం సృష్టించింది. లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా వాట్సాప్‌లో శృంగార దృశ్యాల క్లిప్‌లు కూడా పంపిందని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తీవ్రదుమారం రేపింది.