రామ్ తో ముచ్చటగా మూడోసారి నటించనుందా..?

రెడ్ సినిమాతో సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్, తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడని వినిపిస్తుంది. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకున్న త్రివిక్రమ్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఐతే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడానికి చాలా టైమ్ పడుతుంది. అప్పటి వరకు వచ్చే గ్యాప్ లో రామ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం బయటకి రాలేదు.

ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. రామ్ తో రెండు సినిమాల్లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్, త్రివిక్రమ్ తో రామ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరికి ఆ చిత్రాలు మంచి సక్సెస్ ని అందించాయి. దాంతో మరో మారు ఈ కాంబో రిపీట్ అయ్యేలా కనబడుతుంది. మరి ఈ సినిమా పట్టాలెక్కనుందా లేదా చూడాలి.