Jabardasth : షాకింగ్‌… జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన‌ సుడిగాలి సుధీర్!

-

Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఫ్యామిలీ ఫ్యాక్ లాంటి ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తూ షో జ‌బ‌ర్థ‌స్త్. జ‌బ‌ర్ద‌స్త్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న కామెడీ షో. మ‌ల్లెమాల క్రియేష‌న్ లో రూపొందుతున్న ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో ప్ర‌సారం అవుతుంద‌నే సంగ‌తి తెలిసిందే. కాస్త బోల్డ్ పంచ్‌లు పేలుతుంటాయన్న పేరు ఉన్నప్పటికీ.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది ఈ షో. ప్ర‌స్తుతం సినిమాల్లో సంద‌డి చేస్తున్న హాస్య న‌టుల్లో చాలా మందికి జ‌బ‌ర్థ‌స్త్ నుంచే వ‌చ్చిన వారే. సినిమాల్లో న‌టిస్తున్నా స‌రే! వారికి జ‌బ‌ర్థ‌స్త్ నుంచి వ‌చ్చిన ఐడెండిటీ మాత్రం చాలా ఉప‌యోగ‌ప‌డింది. అలాగే.. సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఈ షో వారికి చేయూత‌నిచ్చింది. మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టింది. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒక్క‌రూ.

ఈ షో ద్వారా ఆయ‌న ఎన‌లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయ‌న ఈ షో ఫేమ్‌ తో ఎన్నో షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ద‌గ్గించుకున్నారు. త‌న సత్తా చాటుకున్నాడు. ఇదిలా ఉంటే..
నెట్టింట్లో ఓ న్యూస్ తెగ వైర‌ల్ అవుతోంది. ఆ న్యూస్ ఏంటంటే.. సుడిగాలి సుధీర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ట‌.
ఈ క్ర‌మంలో ఫీల్మీ సీటీలో మ‌రో వార్త వైర‌ల్ అవుతుంది. మల్లెమాల ప్రొడక్షన్స్.. ప్రతి ఏడాది కమెడియన్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంద‌ట‌. ఈ అగ్రిమెంట్ ప్ర‌కారం.. జబర్దస్త్‌లో చేస్తున్నవాళ్లు.. వేరే టీవీ షోల్లో చేయకూడదనే నిబంధన. అయితే.. ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తేవారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది.

తాజాగా అలాంటి అగ్రిమెంట్ ను ముక్కు అవినాష్ బ్రేక్ చేసి.. మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాడట‌. అదే బాట‌లో సుడిగాలి సుధీర్ కు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సుధీర్ కూడా ప‌లు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అలాగే.. ప‌లు షోలో కు హోస్ట్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటు షోల‌ను.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేయలేక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడని సమాచారం.

మరో వైపు సుధీర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త‌లు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. సన్నిహితుల ద్వారానే సుధీర్‌కు ఈ సంబంధం కుదిరిందని టాక్. కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయినే సుధీర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ వినిపిస్తోన్నవార్తలపై సుధీర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news