సునీల్ ఆశలన్ని అరవింద మీదే..!

-

స్టార్ కమెడియన్ గా సూపర్ ఫాంలో ఉన్న సునీల్ హీరోగా మారి మొదట్లో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా రాను రాను అతను హీరోగా చేసే సినిమాలు నష్టాలు చవిచూస్తున్నాయి. అందుకే ఇక మళ్లీ కమెడియన్ గా మారి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందాల రాముడు నుండి సిల్లీ ఫెలోస్ వరకు హీరోగా, సపోర్టెడ్ హీరోగా ప్రయత్నాలు చేసి అలసిపోయిన సునీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా కోసం కమెడియన్ గా మారుతున్నాడు.

త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ కు గురువుగా సునీల్ కనిపిస్తున్నాడట. ఇద్దరి మధ్య కామెడీ అదిరిపోతుందని అంటున్నారు. అంతేకాదు త్రివిక్రం, సునీల్ స్నేహితులు కాబట్టి సినిమాతో సునీల్ కు మంచి పేరు వచ్చేలా చేస్తున్నాడట. సునీల్ ఆశలన్ని అరవింద సమేత మీదే పెట్టుకున్నాడని తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా అతని ఆశలను నెరవేరేలా చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news