సన్ని లియోన్ చెల్లెలు వస్తుంది

-

పోన్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న సన్ని లియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ తెచ్చుకుంది. జిస్మ్-2 తో బీ టౌన్ ఎంట్రీ ఇచ్చిన సన్ని కెరియర్ ఏ రేంజ్ లో సాగిందో అందరికి తెలిసిందే. ఆమెకు ఉన్న పోర్న్ బ్యాక్ డ్రాఫ్ సినిమా అవకాశాలను తెచ్చిపెట్టగా బాలీవుడ్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించేలా అమ్మడి అంద చందాలు మంచి కిక్ ఎక్కించాయి.

పోర్న్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్న సన్ని బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పుడు ఆమె సోదరి వంతు వచ్చింది. సన్ని లియోన్ సిస్టర్ మియా రాయ్ లియోని ఓ తమిళ సినిమాతో ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇవనుక్కు ఎంగయో మచ్చం ఇరుక్కు సినిమాలో మియా రాయ్ లియోని ప్రముఖ పాత్రలో నటిస్తుంది. ఏ.ఆర్ ముఖేష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విమల్, ఆష్నా జవేరి, ఆనంద్ రాజ్, మన్సూర్ ఆలీ ఖాన్ లాంటి వారు నటిస్తున్నారు.

బాలీవుడ్ లో సత్తా చాటిన సన్ని లియోన్ ప్రస్తుతం సౌత్ లో నటించాలని చూస్తుంది. తెలుగు తమిళ భాషల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తుండగా ఆమె లీడ్ రోల్ లో వస్తున్న వీరమాదేవి సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. మరి సన్ని కెరియర్ లానే ఆమె సోదరి మియారాయ్ కెరియర్ కూడా ఇక్కడ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఐరోపాలో మియారాయ్ లియోని కూడా ఓ శృంగార తార అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version