“జిన్నా” నుంచి సన్నీలియోన్ వచ్చేసింది

బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ టాలీవుడ్ లోనూ బాగా పాపులర్ అయింది.
మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ కథా నాయకుడు రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చక్కటి పేరు సంపాదించుకుంది. అలా తెలుగు వారికి సుపరిచితమైన సన్నీలియోన్ ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు “జిన్నా” అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో సన్నీ లియోన్‌ కూడా నటిస్తోంది. అయితే.. తాజాగా జిన్నా సినిమా నుంచి సన్నీలియోన్‌ పోస్టర్‌ ను వదలింది. ఇందులో రేణుక పాత్రలో సన్నీ కనిపించనుంది.