అనిల్ రావుపూడి కి సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ..ఎఫ్ 3 తో మే లో సెట్స్ పైకి ..!

-

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అనిల్ రావిపూడి సక్సస్ ట్రాక్ రికార్డ్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. దాంతో అనిల్ రావిపూడి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తీసి సక్సస్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే అనిల్ సూపర్ స్టార్ ని ఎఫ్ 3 కోసం అడిగాడట. సరిలేరు సమయంలోనే అనిల్ కి మహేష్ బాబు కూడా నీతో ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారని అఫీషియల్ గానే న్యూస్ వచ్చింది. ఇప్పుడు అదే నిజం చేశారు అనిల్ రావిపూడి, మహేష్ బాబు.

 

అనీల్ రావిపూడి 2018 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామని దిల్ రాజు తో కలిసి అప్పట్లోనే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 స్క్రిప్టును ప్రిపేర్ చేయడంలో అనీల్ రావిపూడి టీం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో వెంకీ- వరుణ్ లతో పాటు మూడో హీరో ఉంటారు అన్న ప్రచారం జోరందుకున్నాక ఆ పాత్రకు చాలామందిని అనుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ వాటికి చెక్ పెట్టారు సూపర్ స్టార్.

అనిల్ రావిపూడి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నారని.. ఇది దాదాపు కంఫర్మ్ అని సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే సమయంలోనే అనీల్ రావిపూడికి మహేష్ మరో సినిమాని ఆఫర్ చేశారు. అయితే అది సరిలేరు సీక్వెల్ అన్న ప్రచారం సాగుతుండగానే.. అందులో వాస్తవం లేదని సూపర్ స్టార్ ఎఫ్ 3 కోసమే రోజుల కాల్షీట్లు ఇచ్చేశారని తాజా సమాచారం. మే 2020 నుంచి ఎఫ్ 3 షూటింగ్ మొదలవుతుందని మళ్ళీ మహేష్ సరసన రష్మిక ఆడి పాడనుందని అన్నారు. అనిల్ రావుపూడి రాసుకున్న ఎఫ్ 3 కథ, కథనం మహేష్ బాబుకి విపరీతంగా నచ్చాయట. ఇదీ అఫీషియల్ న్యూస్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇక పండగే.

Read more RELATED
Recommended to you

Exit mobile version