తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు నటి సురేఖా వాణి. ఇప్పుడు కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రితతో కలిసి లైఫ్‌ను సరదాగా గడుపుతూ.. వాటికి సంబంధించిన పోస్ట్‌లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే సుప్రిత బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తల్లికూతురులిద్దరూ చిల్ కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఎప్పుడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటిస్తున్న ఆమె రెండో పెళ్లి పై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ నా కూతురు సుప్రీత నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు. కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పింది.
అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా, ప్రస్తుతానికి ఎవరూ లేరని సమాధానం ఇచ్చింది. కానీ తనకు బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నాకు బాయ్ ఫ్రెండ్ గా కావాలి. లైట్ గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి.