టీంఇండియా హెడ్ కోచ్ గా VVS లక్ష్మణ్ నియామకం !

-

ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్‌..తగిలింది. ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నేపథ్యంలోనే విరామం తీసుకున్న టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తాజాగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఆసియా కప్‌ నకు దూరం కానున్నారు.

దీంతో ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే, ఇన్చార్జ్ కోచ్ గా వ్యవహరిస్తారు. ఎన్ సి ఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ ను హరారే నుంచి నేరుగా అక్కడికి పంపే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జింబాబ్వే తో ఆడిన వన్డే సిరీస్ కు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ ను టీమిండియా 3-0 తో క్లీన్ స్లీప్ చేసింది. ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మణ్ అంతకుముందు శ్రీలంక పర్యటనలోనూ కోచ్ గా సక్సెస్ అయ్యాడు. అందుకే ఆసియా కప్ వరకు ద్రవిడ్ స్థానంలో అతని ఎంపికే సరైనదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసియా కప్ కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్ కి ప్రయాణమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news