ద‌ర్శ‌కుడు సురేందర్‌ రెడ్డి నెక్ట్స్ సినిమా హీరో ఫిక్స్ అయిన‌ట్టేనా..

-

`అతనొక్కడే` సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు సురేంద‌ర్ రెడ్డి. సురేందర్ రెడ్డి ఇప్పటివరకు ఓ తరహా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. అయితే ప్ర‌స్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి`. గాంధీ జయంతి సందర్భంగా నేడు విడుదలైన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటించారు.

ఇక తాజాగా సురేందర్‌ రెడ్డి చేయబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ చ‌క్కెర్లు కొడుతోంది. సురేంద‌ర్ రెడ్డి త‌న నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. అయితే ఆ సినిమాలో హీరో ఎవ‌రు అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం సురేంద‌ర్ రెడ్డి త‌న నెక్ట్స్‌ సినిమాను హీరో నితిన్‌ తో చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా చేశాక‌.. మీడియ‌మ్ రేంజ్ హీరోతో సినిమా చేయడం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంద‌ని టాక్ కూడా ఉంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news