‘ అల వైకుంఠ‌పురంలో ‘  అక్కినేని హీరో రోల్ రివీల్‌…

-

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘ అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అక్కినేని మేన‌ళ్లుడు, యంగ్ హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసినప్పటి నుండి సుశాంత్ బన్నీకి సోదరుడిగా నటిస్తున్నాడని కొందరంటే.. లేదు పూజా హెగ్డేకు అన్నయ్యగా కనిపిస్తాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు.

సుశాంత్ రోల్‌పై ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో త‌న రోల్‌పై సుశాంత్ స్పందించాడు. తాను బన్నీకి బ్రదర్‌ని కాదు.. అదృష్టవశాత్తు పూజా హెగ్డేకు కూడా అన్నయ్యను కాదు. అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి అని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్ ‘సామజవరగమన’ మంచి హిట్టైంది.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఓవ‌ర్సీస్ హ‌క్కులు రు.8.5 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయంటున్నారు. ఇక అజ్ఞాత‌వాసి ప్లాప్ త‌ర్వాత అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌తో ట్రాక్ ఎక్కిన త్రివిక్ర‌మ్‌కు.. గ‌త రెండు సినిమాల‌తో ప్లాప్‌లు ఇస్తోన్న అల్లు అర్జున్‌కు ఈ సినిమా హిట్ అవ్వ‌డం అత్య‌వ‌స‌రం.

Read more RELATED
Recommended to you

Latest news