సుప్రీంకోర్టులో సుశాంత్ కేసు కొట్టివేత.. కారణం ఎంటి..?

-

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలో పెద్ద దుమారానికే దారితీసింది. సుశాంత్ మరణం తర్వాత చాలామంది బంధుప్రీతి అంశంపై మాట్లాడుతున్నారు. కొంతమంది అతడిది హత్య అంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది.గురువారం పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తన కొడుకును మోసం చేసి రియా డబ్బులు లాక్కుందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్‌ తండ్రి తన ఫిర్యాదు‌లో తెలిపారు.

Shusanth

దీనిపై సీబీఐ దర్యాప్తు అవసరమో లేదో అనే అంశాన్ని పరిశీలించడానికి ఇటీవల బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఓ లాయర్​ను నియమించారు. తాజాగా సుశాంత్​ది హత్యే అంటూ 26 పాయింట్లతో కూడిన డాక్యుమెంట్​ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.”సుశాంత్​ది హత్యే అని నేను అనుకోవడానికి గల కారణాలు” అంటూ డాక్యుమెంట్ ఫొటోను నెట్టింట షేర్ చేశారు స్వామి. “సుశాంత్​ మెడపై ఉన్న మరకలు చూస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని స్పష్టమవుతుంది. మళ్లీ అతడి శరీరంపై దాడి చేసినట్లు కూడా ఉంది” అనే ఆధారాలు ఈ డాక్యుమెంట్​లో ఉన్నాయి.

ఈ డాక్యుమెంట్​ను షేర్ చేయడానికి ముందు రోజే స్వామి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ను కలిసి ఈ ఆధారాలను చూపించినట్లు తెలిపారు. నితీశ్​ ఈ విషయమై సీబీఐ దర్యాప్తు జరిపేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version